బెస్ట్ బేకరీ అల్లర్ల కేసులో …
నలుగురికి యావజ్జీవం
ముంబయి స్పెషల్ కోర్టు తీర్పు
ముంబయి,జూలై 9 (జనంసాక్షి) :
బెస్ట్ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. జస్టిస్ వి.ఎం.కానాడే, జస్టిస్ పి.డి.కోడేలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్, గతంలో ట్రయల్ కోర్టు నిందితులుగా నిర్దారించిన సంజయ్ థక్కర్, బహదూర్ సింగ్ చౌహాన్, సానాభాయ్ బారియా, దినేష్ రాజబార్‌ల యావజ్జీవాన్ని నిర్దారించింది. గాయపడిన బెస్ట్ బేకరీ కార్మికుల స్టేట్‌మెంట్లను న్యాయమూర్తులు ప్రాతిపదికగా తీసుకున్నారు. గోద్రా సంఘటన తర్వాత నిందితులు బెస్ట్‌బేకరీపై కత్తులతోనూ, తల్వార్‌లతోనూ సిబ్బందిపై దాడి చేశారు. భాదితులు నిందితులను పెరేడ్‌లో గుర్తించారు. గోద్రా రైలు దుర్ఘటన అనంతరం వదోదరలోని బెస్ట్‌బేకరీపై అల్లరి గుంపు దాడి చేసి 14 మందిని చంపివేసింది. ముస్లింలను వారు టార్గెట్ చేసుకున్నారు. బేకరీ యజమాని షేక్ కుటుంబాన్ని కూడా వదలలేదు. ముగ్గురు హిందూ కార్మికులు కూడా మరణించారు. మొత్తం 17 మందిలో 9 మందిపై నేర నిర్దారణ జరిగింది. వారికి యావజ్జీవం విధించగా హైకోర్టులో సవాలు చేశారు. కొసమెరుపు ఏంటంటూ సంఘ పేవాకార్యకర్త తీస్థా సెతల్వాడ్ బాధితుల తరపున కోర్టులో కేసు వేశారు. తాను ఆయన మాట విని 17 మందికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినట్లు యాస్మీన్ షేఖ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తీస్థా కూడా తనకు జరిగిన అనుభవాలపై స్టేట్‌మెంట్ ఇచ్చారు. వీరిద్దరి పిటిషన్లపై కోర్టు ఇంకా తీర్పు ఇవ్వాల్సి ఉంది.