బేగామలో విద్యార్థుల వీడ్కోలు సభ

బజార్‌హత్నూర్‌: మండలంలోని బేగామ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై పలు సూచనలు చేశారు.