బొగస్ అగ్నిపథ్ పతకంను వెంటనే రద్దు చేయాలి సత్యం శ్రీరంగం

 భరోసాలేని పతకాలు మాకొద్దు
  *  అగ్నిపథ్ పథకం రద్దు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది
    * నిరుద్యోగ ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
కూకట్ పల్లి జనంసాక్షి :
 ఏఐసీసీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ కూకట్ పల్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో కేపిహెచ్ బి కాలనీ మెయిన్ రోడ్ లోని గాంధీ విగ్రహం దగ్గర సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్ రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ సైనికుల నియామకాలలో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్ళు సర్వీస్ పెట్టడం దారుణమని, నాలుగేళ్లు తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని గతంలో 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని, సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమని దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ద పడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. సైనిక దళాల ప్రైవేటీకరించడంతో పాటు, సైనిక విభాగాల్లో జీత భత్యాలు, ఇతర ఖర్చులు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే కేంద్రం ఈ పథకం తీసుకువస్తుందని దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నేడు దేశంలో అగ్నిపథ్ అగ్నిగుండంలా మారిందని, బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని, మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారని నేడు అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయకుండా కాంట్రాక్టు ప్రతిపాదికన అగ్నిపథ్ పేరుతో రిక్రూట్మెంట్లు చేసేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకుల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా వెంటనే రిక్రూట్మెంట్లు మొదలు పెట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పుష్పా రెడ్డి, గాలి బాలాజీ, నల్లోల రాజేందర్, యాదగిరి, చున్ను పాషా, మొయిజ్, మధు గౌడ్, సామ్యూల్, మిస్బుద్దీన్, మేకల రమేష్, రమేష్ ముదిరాజ్, తూము వేణు, మట్టే ప్రసన్న కుమార్, మహేందర్, నర్సింహా యాదవ్, సమీ, ఫణి, సూరజ్ తివారి, రాజు ముదిరాజ్, అస్లాం, మధు మోహన్, హేమంత్, నవీన్ గౌడ్, జాన్, చిటికోరి క్రిష్ణా, అరుణ్ రెడ్డి, అశోక్, పప్పూ హుస్సేన్, షాదుల్లా హుస్సైన్, ప్రవీణ్, మదారి శ్రీను, జావీద్ అలీ, జహంగీర్, మహేష్ గౌడ్, గోవింద్ గౌడ్, గణేష్ చారి, రజిత, జ్యోతి, సంధ్య పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area