బొగ్గు కుంభకోణంపై

ఎన్డీఏ హయాం నుంచి తవ్వనున్న సీబీఐ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : దేశానికే మాయని మచ్చగా మిగిలిన బొగ్గు కుంభకోణాని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే బొగ్గు కుంభ కోణం దర్యాప్తును 1993 నుంచి మొదలు పెట్టాలని సీబీఐని కోరింది. అంతే కాకుండా ఎన్డీఏ హయాంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపుపై కూడా ఆరా తీయనుంది. శనివారం తాజాగా రెండు కంపెనీలపై కేసులు నమోదు చేసిన సీబీఐ, దేశ వ్యాప్తంగా ఏడు నగరాల్లో దాడులు చేసింది. వికాస్‌ మెటల్స్‌ అండ్‌ పవర్స్‌, గ్రేడ్‌ ఇండస్ట్రీస్‌
కంపెనీలు తమ ఆస్తుల విలువను పెంచి చూపించి అక్రమంగా బొగ్గు లైసెన్సులు పొందినట్లు సీబీఐ ఆరోపించింది. నాగ్‌పూర్‌, చందేర్‌పూర్‌, కోల్‌కతా, అసన్‌పోల్‌, పురులియా, ఘాజియాబాద్‌ నగరాల్లో ఈ కంపెనీల కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ కంపెనీల మేనేజింగ్‌ డైరెక్టర్లు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా లైసెన్సులు పొందినట్లు సీబీఐ వెల్లడించింది.