బోడును మండలంగా ప్రకటించాలి…మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రజా ప్రతినిధుల హెచ్చరిక

టేకులపల్లి, అక్టోబర్ 3( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలో గల బోడు ప్రాంతాన్ని బోడు నూతన మండలం గా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో బోడు ప్రాంతం పరిధిలో గల 12 మంది సర్పంచులు, ఎంపీపీ తో పాటు మరో నలుగురు ఎంపీటీసీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. మంగళవారం బోడులోని రైతు వేదికలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేశారు. 12 మంది సర్పంచులు, ఐదుగురు ఎంపీటీసీలతో పాటు ఆ ప్రాంత వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బోడును ప్రత్యేక మండలం గా ఏర్పాటు చేయాలని వివిధ దశల్లో ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నో పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. అదేవిధంగా వారి ద్వారా మంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. బోడును ప్రత్యేక మండలం గా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, జనాభా విస్తీర్ణం 22 వేల మందితో, 11 వేల 500 మంది ఓటర్లు ఉన్నారని, జనాభా నిష్పత్తి తో పాటు తగినన్ని వనరులు కూడా ఉన్నాయని, 47 గ్రామాలతో, 12 గ్రామపంచాయతీలతో, 5 ఎంపీటీసీ లతో విస్తీర్ణం కలిగి ఉన్నదని, ప్రస్తుత టేకులపల్లి మండలానికి 25 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల వరకు దూరం నుండి నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సి వస్తుందని అన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అభివృద్ధికి కుంటుపడుతున్న బోడు ప్రాంతాన్ని ప్రత్యేక మండలం గా ఏర్పాటు చేయడానికి అధికారులు