బోథ్ పాత్రికేయులకు సన్మానం

బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం తో పాటు మండల పత్రిక మిత్రులను, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల సర్పంచ్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ సురేందర్ యాదవ్ మాట్లాడారు. పాత్రికేయుల సమస్యలను సానుకూలంగా పరిష్కారం చూపుతామని అన్నారు. ఎల్లవేళలా ప్రజల సమస్యలను పరిష్కరించే పత్రిక మిత్రుల సేవలు అమోఘం అని అన్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య వారధి గా ఉంటూ సమస్యలు పరిష్కారం దిశగా పత్రిక మిత్రులు పని చేస్తుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు సురేందర్ యాదవ్, చెట్లపెళ్లి సదానందం, సంగ్రామ్, గంగాధర్, మారుతీ,
 ప్రింట్ మీడియా నూతన కార్యవర్గ అధ్యక్షులు కార్తీక్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నమలికొండ సంతోష్ కుమార్, గంగన్న, నందకుమార్, దేవిదాస్, పురుషోత్తం, రాము, అనిల్, నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు