బ్యాంకులకు వరుస సెలవులు

ముంబై,నవంబర్‌20(జ‌నంసాక్షి): బ్యాంకులకు ఈ వారంలో నాలుగు రోజులు వరుస సెలవుఉల రానున్నాయి. ఆరు రోజుల్లో 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. వారాంతంలో ఒక గురువారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఆ రోజు కూడా కుదరకపోతే లేకపోతే సోమవారం వరకు ఆగాల్సిందే. ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సరిపడేంత నగదు విత్‌డ్రా చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం. బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బుధవారం ఈద్‌-ఇ-మిలాద్‌-ఉల్‌-నబీ కాగా, శుక్రవారం గురునానక్‌ జయంతితో పాటు కార్తీక పౌర్ణమి కూడా ఉంది. ఇక వారాంతమైన 24, 25 తేదీలు ఎలాగూ నాలుగో శనివారం, ఆదివారం సెలవు దినాలనే విషయం తెలిసిందే. దీంతో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయితే.. శుక్రవారం మాత్రం కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, రాంచీ, రాయ్‌పూర్‌, శ్రీనగర్‌, డెహ్రాడూన్‌,

జమ్మూల్లో బుధ, శుక్ర, శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక భోపాల్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లోని బ్యాంకులకు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే సెలవులు ఇచ్చారు.