బ్రహ్మాస్ క్షిపణి విజయవంతం
బాలాసోర్(ఒరిస్సా):
ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. లక్ష్యదూరం 290 కిమీ. భూమిపై తిరిగే చాలన ప్రయోగశకటం (మొబైల్ లాంచర్) నుంచి ఉదయం 10.30 గంటలకు లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ప్రయోగించారు. క్షిపణి ప్రయాణ సమాచారం విశ్లేషణలో ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఉపరితలం నుంచి ఉపరిత లానికి ఈ క్షి పణిని ప్రయోగించవచ్చు. సైన్యం అవసరాల కోసం ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఇది రెండు దశలలో ప్రయాణిస్తుంది. ఘన ఇంధనంతో నడుస్తుంది