భక్తులకు ఉచిత నేత్ర పరీక్షలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 23(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఉరుసు శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో మంగళవారం భక్తులకు శరత్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా 98 మందికి నేత్ర పరీక్షలు చేయగా ఇందులో ఎనిమిది మంది ఆపరేషన్ చేసుకోవాలని సూచించినట్లు క్యాంప్ కోఆర్డినేటర్ ప్రవీణ్ తెలిపారు. అలాగే కళ్ళద్దాలు పెట్టుకోవాలని కొందరికి, మరికొందరికి మందులు రాసినట్లు తెలిపారు. ఉచితంగా నేత్ర పరీక్షలు చేసిన శరత్ ఐ హాస్పటల్ వారిని భక్తులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ ప్రవీణ్, అనిల్, శ్రీ దివ్య తదితరులు పాల్గొన్నారు.