భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జెపి నడ్డా
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 27(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ, విజయశాంతి లక్ష్మణ్, తదితర నేతలు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు నేతలకు స్వాగతం పలికారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందేలా ఆశీర్వదించారు. వేలాదిమంది బిజెపి కార్యకర్తలతో భద్రకాళి ఆలయం క్రిక్కిరిసిపోయింది