భలే ఉంది..!అక్రమఇసుక రవాణా..!భలే ఉంది..!అక్రమఇసుక రవాణా..!

భైంసా రూరల్ ఫిబ్రవరి 15 జనం సాక్షి
అధికారులకు మాత్రం అంతంత మాత్రమే పట్టింపు..!
ఇలా అయితే ఏలా అంటున్న స్థానికులు..!
ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్న వైనం..!

నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని పెండ్ పల్లి,సాధ్గం, మాటేగా0, కామోల్ ఇలా పలు వాగులలో నుండి ఇసుక బకాసురులు విచ్చలవిడిగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.కొన్నిచోట్ల పగలైతే అధికారుల బెడద ఉంటుందని రాత్రిళ్ళు సైతం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.అక్రమంగా తరలిస్తున్న ఇసుకనుచూసి పలువురు స్థానికులు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ముదోల్ నియోజకవర్గంలోని పలు గ్రామల వాగులనుంచి ఇసుక బకాసురులు అక్రమ ఇసుక రవాణ చేస్తున్నారు. గ్రామాలలో వెలిసిన కమిటీలు కొన్ని చోట్ల 30 లక్షలు, మరికొన్నిచోట్ల పది నుంచి 20 లక్షలు వేలంపాట పాడి మరి తీసుకోగా, ఇటువంటి ఘటనలతో ప్రభుత్వ ఖజానా గoడి పడుతుందని, ఇప్పటికి ఎక్కడ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని చలానా వేసిన దాఖలాలు లేవనీ… దాదాపు ప్రతి యేట ఎండాకాలం ప్రారంభం అవుతుందంటే ఇసుక దళారుల దందా మొదలై రెచ్చిపోతున్నారు.బైంసా మండలంలోని మాటేగాo సుద్ధ వాగు నుండి కొందరుదుండగులు అక్రమంగా ఇసుక డంపు చేసి అధిక ధరలు పెరుగుతున్న తరుణంలో అమ్ముతున్న వైనంకూడా కనబడుతుంది. అధికారులు స్పందించి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని పలువురుస్థానికులు కోరుకుంటున్నారు.