భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు ‘ ఛలో కలెక్టరేట్‌ ‘ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు వేలాది మంది భవన
నిర్మాణ కార్మికులు కాకినాడ కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వాడుకున్న కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను రూ.900 కోట్లను తిరిగి చెల్లించాలన్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్‌ 1200 క్లయిమ్‌లకు 3 కోట్ల పరిహారాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇతర రాష్టాల్రలో ఇస్తున్నట్లు.. సంక్షేమ బోర్డు ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను ప్రతీ కార్మికునికి రూ.3 వేలు చెల్లించాలని కోరారు. చంద్రన్న బీమా ద్వారా కాకుండా సంక్షేమ బోర్డు ద్వారా మాత్రమే పధకాలను అమలు చేయాలన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల సొంతింటి నిర్మాణానికి, పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.