భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ కృషి.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ కృషి.ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓ మయ్య.

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-మండల ఏఐటీ యూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు మండల అధ్యక్షులు నల్ల గంగాధర్ అధ్యక్షతన శుక్రవారం రోజున మండల కేంద్రంలో సమావేశం నిర్వహిం చారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, బాన్సువాడ నియోజక వర్గ సిపిఐ ఇంచార్జీ దుబాస్ రాములు హాజరైనారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా ఏఐటీ యూసీ పోరాట ఫలితంగానే భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైందన్నారు.ఈ బోర్డ్ ద్వారా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కుటుం బాలకు ఆర్థిక భరోసా కల్పించ డం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న ప్రభుత్వం మాత్రమే కార్మికుల పెన్షన్ సౌకర్యం కల్పించడానికి నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికులు సహజ మరణం పొందితే రెండు న్నర లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షలు,58 సం.ల నిండిన కార్మికులకు రూ.5000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాం డ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుడాల రాములు,రాజు,గురువయ్య, అన్వర్,నితిన్,కొత్తపల్లి రాములు,బాలయ్య,సున్నం భరత్,హనుమాన్లు,కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.