భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
రాహుల్ గాంధీ ఫ్లెక్సికి క్షీరాభిషేకం
సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 07(జనం సాక్షి)ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యుడు గంప మహేందర్ ఎస్సీ సెల్ చైర్మన్ బొమ్మల యాదగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ లు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏ ఐ సి సి నాయకురాలు సోనియా గాంధీ యాత్రలో పాల్గొన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న చందంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి యాత్రలో భాగంగా షూ లేసులు బిగించడం పట్ల ఆయన ప్రవర్తించిన తీరు అభినందనీయమన్నారు. కన్నతల్లి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారిని పట్టించుకోకుండా దూరంగా ఉంచారని చెప్పారు. పుట్టిన తల్లికి సేవ చేయలేని మోదీ దేశానికి ఇంకేం సేవ చేస్తాడని చెప్పారు. డబ్బుల మోజులో పడి కేంద్ర పథకాల పేరిట ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. భారత్ జోడోయాత్ర పేరిట వస్తున్న రాహుల్ గాంధీకి విశేష ప్రజాదరణ వస్తుందని ఇక్కడ చూసిన రాహుల్ వెంటే నడుస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని పూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. అందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో కార్యాచరణతో ముందుకెళ్తామని, దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్న తీరును వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గడపగడపకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి చంద్రశేఖర్ పూజల గోపికృష్ణ కలిముద్దీన్ అబ్దుల్ వహాబ్ అజ్మత్ అంజయ్య గ్యాదారి మధు. మున్నా తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.