భారత్ హ్యాట్రిక్
ఆసియా కప్ మహిళల టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా ఆరోసారి టైటిల్‌ను సాధించింది. అరుదైన ‘డబుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ ఓవర్ల కోటా పూర్తయ్యే సమయానికి ఆరు వికెట్లకు 104 పరుగులు చేయగలింది. భారత వనే్డ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
భారత్ ఇన్నింగ్స్:20 ఓవర్లలో 5 వికెట్లకు 121 (మిథాలీ రాజ్ 73 నాటౌట్, ఝూలన్ గోస్వామి 17, అనామ్ అమీన్ 2/24).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 104 (జవేరియా ఖాన్ 22, బిస్మా మరూఫ్ 25, అయేషా జాఫర్ 15, ఏక్తా బిస్త్ 2/22).