భారత్ VS పాకిస్థాన్
హాకీ ఆసియా చాంపియన్స్ అయిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి తలపడనుంది.కాగా లండన్‌లో వచ్చే ఏడాది జరిగే పురుషుల హాకీ వరల్డ్ లీగ్(హెచ్‌డబ్ల్యూఎల్) సెమీ ఫైనల్ 2017లో భారత్,పాకిస్థాన్ జట్లు ఒకే పూల్‌లో పోటీపడనున్నాయి.2018 ప్రపంచ కప్ అర్హత కోసం నిర్వహించే హెచ్‌డబ్ల్యూఎల్ సెమీ ఫైనల్ పోటీలు 2017జూన్ 15నుంచి 25 వరకు లండన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ ఒలింపిక్స్ పార్క్‌లో జరుగనున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ హాకీ జట్లు ఇందులో తలపడనున్నాయి.ఇప్పటికే ఆరుజట్లు ఈ పోటీలకు ఎంపికయ్యాయి. అతిథ్య బం గ్లాదేశ్, రియో ఒలింపిక్స్ చాంపియన్స్ అర్జెంటీనా, యూరోపియన్ నెదర్లాండ్స్,భారత్,కొరియా, పాకి స్థాన్ జట్లు వీటిలో ఉన్నాయి.వచ్చే ఏడాది జనవరి నుంచి జరిగే హాకీ వరల్డ్ లీగ్ రౌండ్ 2 నుంచి మరో నాలుగు జట్లు దీనికి అర్హత సాధిస్తాయి.హెచ్‌డబ్ల్యూఎల్ సెమీఫైనల్ పోటీల్లో భాగంగా జూన్ 18న ఆదివారం భారత్,పాక్ జట్ల మధ్య పోరు జరుగనుంది.కాగా రసవత్తరంగా జరిగే ఈ మ్యాచ్‌తో ఆదివారం సూపర్ సండేగా మారునుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇటీవల అక్టోబరు 30న జరిగే ఆసియా చాం పియన్ ట్రోఫీ ఫైనల్ పాక్‌ను 3-2 తేడాతో ఓడించి భారత్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.