భారీ ఎత్తున బీఎస్పీ లో చేరిన యువకులు
భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి): మండలంలోని కుఫ్కాల్ గ్రామానికి చెందిన యాభై మంది యువకులు మంగళవారం నాడు బీఎస్పీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి చెప్పల గణేష్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ దళిత, గిరిజన, బీసీ,మైనార్టీ, అగ్రకులాల పేదల జీవితాలు బీఎస్పీ పార్టీ ద్వారానే మారుతాయని,అందుకే భారీ ఎత్తున యువకులు పార్టీలో చేరుతున్నారని అన్నారు.టీఆరెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అన్ని హక్కులూ కల్పించాలని ఆరేస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఘనత సాధించారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు బెనర్జీ, మేకల క్రంతి,సునీల్ తదితరులు పాల్గొన్నారు.