భూకబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి….

టేకుమట్ల.సెప్టెంబర్09(జనం సాక్షి) మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామం శివారు కలికోట గ్రామానికి చెందిన వేమ లక్ష్మణ్ అనే రెవిన్యూ ఉద్యోగి తనకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉండబడిన మూడు గంటల నివాస స్థలాన్ని నమ్మించి మోసం చేసి తను అక్రమంగా పట్టా చేసుకున్నాడని పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ముగా రాజగట్టు అనే వ్యక్తి పత్రిక  ఆరోపించారు. మూగ రాజ గట్టు అనే వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి పట్టణం బాంబుల గడ్డ వద్ద తమకు 2001 సంవత్సరంలో పాత ఇంటి నెంబర్ 17-43, కొత్త ఇంటి నెంబర్ 19-3 లోగల మూడు గుంటల భూమిని నమ్మించి లాక్కున్నాడని, మేము భూమి విషయం   పలుమార్లు అడగగా మాపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని కలికోట పల్లి శివారులో వ్యవసాయ భూమి ఇస్తానని నమ్మించి తన కుమారుడు తన భార్య పేర్లపై నమోదు చేసుకున్నాడని,రెవెన్యూ అధికారుల అండదండలతో కలికోటపల్లి శివారులో సర్వేనెంబర్ 377/1/1 లో వేమ స్వరూప,పేరుమీద మూడు ఎకరాల 30 గుంటలు అసైన్ భూమి,వేమ రోహిత్ పేరుమీద 28 గుంటల అసైన్ భూమిని పట్టా చేసుకున్నాడని ఇవే కాకుండా కలికూట పల్లి శివారులో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పలుకుబడితో పట్టా భూములుగా మార్చుకొని చలామణి అవుతున్నాడని, పలు సర్వే నంబర్ల మీద సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సదరు వ్యక్తిపై చర్యలు చేపట్టలేదని, టేకుమట్ల మండలంలో జరుగుతున్న భూకబ్జాలపై సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం కావాలని సంబంధిత అధికారులకు పాత్రులు చేసిన పూర్తిస్థాయిలో సహకరించకుండా చేతులు ఎత్తివేస్తున్నారని బాధితుడు మూగ రాజ గట్టు అన్నాడు. ఇప్పటికైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్  మిశ్రా స్పందించి సంబంధిత భూపాలపల్లి రెవిన్యూ డివిజన్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వేముల లక్ష్మణ్ పై చర్యలు తీసుకుంటూ,సస్పెండ్ చేయాలని బాధితుడు మూగ రాజగట్టు కోరారు.