మండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. గురువారం  ఉదయం మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, మండలి సభ్యులు హాజరయ్యారు. దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, శాసనమండలి మాజీ సభ్యుడు నేరెళ్ల వేణుమాధవ్‌లకు, కేరళ వరదలు, కొండగట్టు బస్సు ప్రమాదాల్లో మరణించిన వారికి సంతాపంగా సీఎం కేసీఆర్‌ సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం సభ వాయిదా పడింది.