మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్ పోలీసుపై దాడి
శ్రీనగర్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్ కానిస్ణేబుల్‌పై మంత్రి భద్రతా సిబ్బంది దాడికి దిగిన ఘటన జమ్మూ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది రాష్ట్ర నీటిపారుదల వరద నియంత్రణ మంత్రి తాజ్‌మోహిద్దిన్ కాన్వాయ్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ సెంటర్ వద్ద నిన్న సాయంత్రం ట్రాఫిక్ సిగ్నల్‌కు పాటించక ముందుకెళ్లింది దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్ మోహన్‌లాల్ కాన్వాయ్‌ను ఆపేందుకు యత్నించాడు తీంతో రోడ్డు మధ్యలో కాన్వాయ్‌ని డ్రైవర్ ఆపి ఈకారు ఎవరిదో నీకు తెలియదా అని ప్రశ్నించాడు ఇది మంత్రి కారని తనకు తెలుసని కానీ ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించడం తప్పని చెప్పాని దీంతో కారులోంచి దిగిన మంత్రి భద్రతా సిబ్బంది అ్కడున్న ట్రాఫిక్ పోలీసులు పై దాడికి దిగారు దాడిని అడ్డుకోవడానికి యత్నించిన ఇన్ స్పెక్టర్ మొహంపై తుపాకీ మడమతో బలంగాకొట్టి గాయపరిచారుగాయపడ్డ అతన్ని సహచరులు ఆసుపత్రికి తరలించారు మరోవైపు ఈఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందిచారు ట్రాఫిక్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన భధ్రతా సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు దాడికి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు