*మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మూడు కుటుంబాలకు రైతుభీమా ద్వారా ఆర్థిక సహాయం*

బాల్కొండ సెప్టెంబర్ 30 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ముగ్గురు కుటుంబాలకు చెక్కులు అందజేశారు.బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సిరికంటి చిన్న మల్లయ్య,కొబ్బాయి దేవేందర్,చిట్టాపూర్ గ్రామానికి చెందిన షాపురం చిన్న గంగాధర్ రెండు గ్రామాలకు చెందిన ముగ్గురు వివిధ కారణాలతో మరణించగా శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్,మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ మండల నాయకులతో కలిసి 3 ప్రమాద భీమా చెక్కులను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు,ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ5 లక్షలు ప్రమాద భీమా చెక్కులను అందజేశామని తెలిపారు,దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు భీమా పథకాన్ని ప్రవేశ పెట్టారని రైతుపై ఒక్కరూపాయి కూడా భారం పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తూ రైతుభీమా అందేలా కృషి చేస్తుందని అన్నరూ,రైతు మరణించిన వారం రోజుల లోపే రైతు నామిని ఖాతాలో రూ5 లక్షలు జమ అవుతున్నాయని వారు తెలిపారు,లబ్ది పొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు,ఈకార్యక్రమంలో బాల్కొండ సర్పంచి భూస సునీత,చిట్టాపూర్ సర్పంచి చాట్లపల్లి వనజ-గోవర్ధన్ గౌడ్,ఎంపీటీసీ సభ్యులు కన్న లింగవ్వ పోశెట్టి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్ద బాల్ రాజేశ్వర్,ఉపసర్పంచిలు షేక్ వాహబ్,న్యావానంది రాజేందర్,తెరస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,చిట్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు న్యావానంది సాయన్న, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,AEOలు నిహారిక,కృష్ణవేణి,తెరాస మండల నాయకులు ద్యావతి రాజు మురళీ,గడ్డం సాయన్న,నల్ల తిరుపతి,తెడ్డు చక్రి,రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.