మంత్రుల నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపి

హైదరాబాద్‌: అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అమలుచేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ హైదరాబాద్‌లోని మంత్రుల నివాసాన్ని ముట్టడించింది. పేద విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సజావుగా అమలుచేసే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ఏబీవీపి విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రుల నివాసం దగ్గర కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.