మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..

తిమ్మన్నపల్లి సర్పంచ్ సుదర్శన్.
ఊరుకొండ, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):
మత్స్య కారుల సంక్షేమానికి.. అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తిమ్మన్నపల్లి సర్పంచ్ సుదర్శన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డిలు అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండలంలోని తిమ్మనపల్లి చెరువులో 35వేల చేప పిల్లలు, జగబోయినపల్లి చెరువులో 45వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారులకు అండగా నిలబడుతూ చెరువుల్లో చేప పిల్లలను వదిలి, ఆ చేపలను పెంచి మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో ఊరుకొండ మండలంలోని తిమ్మనపల్లి, జగబోయినపల్లి గ్రామాల్లోని చెరువులలో మొత్తం 80వేల చేపపిల్లను వదిలామన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్, బక్క జంగయ్య, బచ్చలకూర రమేష్, బొబ్బిలి సాంబశివుడు, మణిపాల్ రెడ్డి, రవీందర్,
టిఆర్ఎస్ మండల నాయకులు కొమ్ము శీను, రాచకొండ గోపి, బండి మల్లేష్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రేవల్లి వెంకటయ్య, మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ తిరుపతయ్య, సభ్యులు శీను, తదితరులు పాల్గొన్నారు.