మత సామరస్యానికి ప్రతీక దర్గా ఉత్సవాలు
ఈనెల 27వ తేదీ ఘనంగా ప్రారంభం
ముస్తాబైన సయ్యద్ పల్లి దర్గా
పరిగి రూరల్, సెప్టెంబర్ 25 ( జనం సాక్షి)
హిందూ ముస్లిం సోదర భావానికి నిలువెత్తు నిదర్శం,కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుందుతున్న సయ్యద్ పల్లి హజ్రత్ ఖాజా సయ్యద్ మఖ్దు మ్ షా హుస్సేని చిస్తి జిందవలి దర్గా ఉత్సవాలు ఈనెల 27వ తేదీన ఘనంగా ప్రారంభం కానున్నాయి. వికారాబాద్ జిల్లాలోనే పరిగి మండలం సయ్యద్ పల్లి దర్గా ఉత్సవాలకు ఎంతో పాముఖ్యత సంతరించుకుంది.
నాలుగు రోజుల పాటు దర్గాలో జరిగే ఉత్సవాలు
ఈ హజ్రత్ ఖాజా సయ్యద్ మఖ్దుమ్ షా హుస్సేని చిస్తి జిందవలి దర్గా లోఈనెల 27వ తేదీ మంగళవారం సాయంత్ర 6 నుంచి రాత్రి 11 గంటలవరకు ఖవ్వాలీ, 28న బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు గందము ,చందన పూజ , 29న గురువారం సాయంత్రం 7 నుంచి 11 వరకు దీపారాధ, ఖవాలీ, 30న శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖత్మే ఖురాన్, ఖవాలీ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి. నాలుగు రోజుల పాటు దర్గాలో వచ్చిన భక్తులందరికీ అన్నాదాన( ప్రసాదం) కార్యక్రమం ఉంటుంది.
కోరిన కోరికలు తీర్చే దర్గా : సయ్యద్ ముక్తార్ హుస్సేని ఖిస్తీ (దర్గా ఫీఠాది పతి )
ఈ హజ్రత్ ఖాజా సయ్యద్ మఖ్దుమ్ షాహుస్సేని చిస్తి జిందవలి దర్గా మా తాత ముత్తాతల నుంచి ఫీఠాది పతులుగా వ్యవహరిస్తు దర్గా ప్రత్యేకతను భక్తులకు చాటి చెబుతున్నాం. ఈ దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తే కోరిక కోరికలు నెరవేరుతాయని ఆనాటి నుంచి వస్తున్న భక్తుల ఆపార నమ్మకం.ఇప్పుడు నేను పీఠాధిపతిగా వ్యవహరిస్తు స్థానికి ప్రజలు, నాయకులు, దాతల సహాకారంతో దర్గాను అభివృద్ది చేస్తూ వస్తున్నాం. భక్తులు దర్గాకు వచ్చి దర్గాలోని అప్పగారి కృపకు పాత్రులు కాగలరు.
ఫోటో రైటప్ :
25 పిఆర్జి 01లో ఉత్సవాలకు ముస్తాబైన దర్గా
02లో పాలరాయి, గాజుతో ముస్తాబైన దర్గా
03లో సయ్యద్ ముక్తార్ హుస్సేని ఖిస్తీ ( దర్గా పీఠాధి పతి )