మనాలి-గుప్తకాశీ మార్గం మూసివేత

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని మనాలి-గుప్తకాశీ మార్గంలో బుధవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో రేపు మధ్యాహ్నం వరకూ గుప్తకాశీ వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు కేదార్‌నాథ్‌ను మబ్బులు పూర్తిగా కమ్మేశాయి. ఎటుచూసినా మంచు కమ్ముకుంది.
భరీ వర్షాలు కొనసాగుతుండటంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు నిలిపిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంకా వేల మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఉత్తరాఖండ్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మన రాష్ట్రం నుంచి ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ వెళ్లారు.