మన బస్తి మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
మన బస్తి మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన మనబస్తిమనబడి కార్యక్రమం క్రింద ఎంపిక చేయబడిన మా పాఠశాలకు అవసరమైన వసతుల కొరకు అమలుపరిచే ఇంజనీరింగ్ విభాగం డిపార్ట్మెంట్ 12 అంశాలకు సంబంధించిన నిరంతరం నీటి సరఫరా తో మరుగుదొడ్లు విద్యుదీకరణ త్రాగునీరు ఫర్నిచర్ పెయింటింగ్ పెద్ద తరహా మరియు చిన్న తరహా మరమ్మతులు ఆకుపచ్చ రాత బోర్డులు పహరి గోడ వంటగది శిథిల భవనాలు స్థానంలో నూతన గదులు భోజనశాల ఉన్నత తరగతులలో డిజిటల్ సౌకర్యాలు వివిధ పనులకు నిధులు 2546513 పాఠశాలకు ప్రభుత్వం మంజూరు చేయడం ఈ పనులకు అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ తో కలిసి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పాఠశాలలో త్రాగు నీటి వసతి టాయిలెట్స్ సౌకర్యం విద్యుత్ సరఫరా తో పాటు విద్యార్థులకు కూర్చోవడానికి బెంచీలు టేబుల్స్ వంటి సౌకర్యాలు కనిపించనున్నారని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతయ్య, ఉపాధ్యాయులు అపర్ణ, లక్ష్మమ్మ, ఎస్ఎంసి మెంబర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.