మమత అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు

కోల్‌కతా, జనంసాక్షి: పంచాయితీ ఎన్నికలు నిర్వహణ విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అప్పీల్‌ను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. పంచాయితీ ఎన్నికలను జూలై 15లోగా మూడు దశలుగా నిర్వహించాలని,400 మంది పరిశీలకులను నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాలనుంచి కానీ, కేంద్రం నుంచి కానీ బలగాల సహాయం తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపి మూడు రోజులుగా ఎన్నికల తేదీలు ప్రకటించాలని సూచించింది.