మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు
అల్వాల్ (జనంసాక్షి) జూన్ 22
అల్వాల్ పట్టణ కేంద్రం లోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనజిగూడలో ప్రపంచంలోనే అరుదైన అత్యంత విశిష్టమైన మరకతంతో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కి వారోత్సవాల్లో భాగంగా శ్రీవారికి 32 ఔషధీ కృత ద్రవ్యాలతో విశిష్టమైన పూజలు అభిషేకాలుదర్బార్సేవలునిర్వహిం చినఆలయవ్యవస్థాపకులు నిర్వాహకు లు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి పూజ లో పాల్గొంటే దైవానుగ్రహం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి మనశ్శాంతి వ్యాపార అభివృద్ధి కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.రెండు సంవత్సరాలు పైగా చిలకలగూడ చౌరస్తా లో నిర్వహించిన అన్నప్రసాద వితరణ నిర్విరామంగా సాగుతుంది అని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్థిక సమస్యలు గృహ వాస్తు అనారోగ్య నరదృష్టి నవగ్రహ దోషాల నివారణకు అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరమైనది అని శాస్త్రి తెలిపారు. అన్నప్రసాద విరాళాలు సమర్పించు దలచిన భక్తులు ఆలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.విరాళాలు ఇచ్చిన వారి పేరు మీద ప్రత్యేక పూజ స్వామివారి లడ్డు వడ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందనిభక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలనిమనవి చేశారు.ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.