మరింత బలహీనపడ్డ వాయుగుండం
విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశరాఉ. ఇది కోసాంధ్ర తీరానికి సమీపంలో స్థిరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.



