మరింత వేగంగా తెలంగాణ అభివృద్ది
ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే సంకల్పం
మున్సిపాలిటీల్లోనూ టిఆర్‌ఎస్ గెలవాలి
జోగురామన్న పిలుపు
ఆదిలాబాద్,నవంబర్26(జనం సాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత ఐదేళ్ల అభివృద్దిని
చూపి ప్రజలు టిఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించి సిఎంగా కెసిఆర్‌ను చేసారని మాజీమంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్‌అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అభ్యర్తి సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, నిరంతరాయ విద్యుత్ కొనసాగాలన్నా టిఆర్‌ఎస్ మరోమారు అధికారంలోకి రావాల్సి ఉందన్న లక్ష్యంతో ప్రజలు అధికారం కట్టబెట్టారని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు చాలా కీలకమైనవన్నారు. విపక్ష నాయకులు చెప్పిన మాయ మాటలను నమ్మి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కుంటు పడుతుందన్నారు. రాష్టాన్న్రి అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్‌పై అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలతో అందరికీ న్యాయం జరిగిందన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎన్నికలప్పుడు ఇంటింటికీ తిరిగి నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు వినే స్థితిలో లేరన్నారు.కేసీఆర్‌తోనే అభివృద్ధి జరుగుతుందని అనేకులు గుర్తించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరవాత ప్రజలు కోరుకున్న పాలననే కేసీఆర్ అందించారన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా కాపాడు కోవాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్టాన్న్రి అభివృద్ధి పథంలో ముందుంచేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, అందుకోసం ప్రజలందరూ అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. విపక్షాలు అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం తప్ప మరొకటి లేదన్నారు. ప్రతిపక్షాలు అధికారం కోసం పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీకానీ, నాయకుడు కాని లేరన్నారు. 68 ఏళ్లు రాష్టాన్న్రి పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేక ఘోరంగా విఫలమయ్యాక టీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బడుగుబలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.