మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరి
కడప,అక్టోబర్30(జనంసాక్షి): గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై వెలుగు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చెప్పారు. జిల్లాలో 1.75 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు అనేక నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. డ్వాక్రాలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్క మహిళ డిసెంబరు నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించు కోవాలని కోరారు. జిల్లాలో డ్వాక్రా సంఘాలకు రూ.175 కోట్ల రుణాలు ఇప్పించామని తెలిపారు.