మరోసారి వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే…
జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్…
బేల, జూలై ( జనం సాక్షి ) : ప్రజా గోస బిజెపి భరోసా యాత్ర లో రైతులు ప్రజలు ఏదో భరోసా ఇస్తారని అనుకుంటే ఎలాంటి భరోసా ఇవ్వకుండానే సాగిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. గురువారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మేల్యే జోగురామన్న పై అవగాహన లేకుండా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముందుగా మి జిల్లాలో పసుపు రైతుల పక్షాన నిలబడి వారి శ్రేయస్సు కోసం పాటు పడాలని అన్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటలు మునిగిపోయయానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా హామీ ఇస్తారని ఎదురుచుసారు కానీ ఎలాంటి భరోసా ఇవ్వకుండానే వెళ్లిపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రములో టిఆర్ఎస్ ప్రభుత్వం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం లో టిఆర్ఎస్ పార్టీ నీ ఎదురుకోనే శక్తి ఎవ్వరికీ లేదని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఎమ్మేల్యే జోగురామన్న ప్రత్యేక నిధులను మంజూరు చేసి పనులు చేస్తున్నారని ఇది చూసి ఓర్వలేక బిజెపి నాయకులు మతి స్థిమితం లెకుండా మాట్లాడుతున్నారని అన్నారు.ఈ సమావేశంలో సినియర్ నాయకులు గంభీర్ ఠాక్రే ,దేవన్న, మండల పార్టీ అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్, సతీష్ పవార్, కో ఆప్షన్ మేంబర్ తన్విర్ ఖాన్, సర్పంచ్ ఇంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు…