మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ తమిళి సై….

ప్రోటోకాల్ పాటించని అధికారులు స్థానిక  ఎమ్మెల్యే….

భక్తుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా..

విద్యార్థుల ఆహ్వానం మేరకు బైరాన్ పల్లి వెళుతున్నా.

కొమురవెల్లి జనం సాక్షి
రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం జరిగింది. గురువారం కొమురవెల్లి పర్యటనలో భాగంగా  మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. గవర్నర్ కు స్వాగతం పలికేందేకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. దీంతో ఆలయ ఈవో ఆలూరి బాలాజీ చైర్మన్ బిక్షపతి ఆలయ అర్చకులు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.గవర్నర్ తమిళసై సౌందర్యరాజాన్ కు ఆలయ అర్చకులు ఆమెకు శాలువ కప్పి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు. స్వామి వారి దర్శనం అనంతరం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ విలేకరులతో మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న స్వామి క్షేత్రం గొప్ప శైవక్షేత్రం పురాతనమైన మరియు అతిశక్తివంతమైన మల్లన్న స్వామిని  కార్తీక మాసంలో దర్శించుకొని పుట్టు లింగాలకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ముఖమండపంలో పట్నాలు చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అని అన్నారు.ఈ సందర్భంగా మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ  దేశంలోని ప్రజలందరూ  ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కొమురవెల్లి మల్లన్న దేవుని కోరుకున్నట్లు తెలిపారు.ఈ క్షేత్రానికి సమీపంలో భక్తుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పాటు రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా, కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖతో ప్రత్యేకంగా మాట్లాడి త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తాను అని అన్నారు.
తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు బైరాన్ పల్లి గ్రామానికి ఆహ్వానించారని, విద్యార్థుల ఆహ్వానం మేరకు బైరాన్ పల్లి వెళుతున్నాని తెలిపారు.ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకాలేదుకదా ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదా అన్న విలేకరుల ప్రశ్నకు మీరు ఏమీ స్పందిస్తారు. ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే కదా అని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు జడ్పిటిసి సిలివేరు సిద్ధప్ప ఎంపీపీ తలారి కీర్తన ఎంపీడీవో అనురాధ  తాసిల్దార్ లక్ష్మీనారాయణ హుస్నాబాద్  ఏసీపి సతీష్ కుమార్ ఎస్ఐ చంద్రమోహన్ యాదవ్ స్థానిక నాయకులు బిజెపి జిల్లా నాయకులు పోలీస్ సిబ్బంది ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.