మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా పంద్రాగస్ట్ వేడుకలు
మానుకోటలో జెండా ఆవిష్కరించిన మంత్రి చందూలాల్
మహబూబాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): జిల్లా అంతగా 72వ స్వాతంత్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా అంతటా మువ్వన్నెల జెండా రెప్పలాడింది. జిల్లాకేద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, సామాజిక,స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖులు జెండా ఎగురవేసారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధ్యక్షతన జరిగిన అధికారిక స్వాతంత్య దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి చందూ లాల్ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శన, స్వాతంత్య సమరయోధులకు సన్మానం,చిన్నారులచే అనేక నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి,ఎంపీ సీతారాం నాయక్,ఎమ్మెల్యే శంకర్ నాయక్,తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తదితరులు హాజరై కార్యమాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఒక బుడతడు పోలీస్ వేషధారణలో పలువురిని ఆకర్షించాడు.