మహాకూటమికి …మహా ఓటమి తప్పదు
కెసిఆర్ ముందు నిలబడే నేత ఉన్నాడా?
తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న చారి
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): మహాకూటమి కట్టినా..అన్ని పార్టీలు ఏకమైనా అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌ను డీకొనడం అంత సులువు కాదన్న భావన ఇప్పుడు ప్రజల్లో కూడా కనిపిస్తోంది. నాలుగేళ్లలో జరిగిన పనులను ఎక్కడిక్కడ చర్చ చేస్తున్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ది నాలుగేళ్లలో కళ్లముందు కనిపిస్తోందని అంటున్నారు. కెసిఆర్ నాయకత్వమే టిఆర్‌ఎస్ గెలుపునకు కారణమవుతుందని అంటున్నారు. విపక్షాలు జతకట్టి ప్రజలకు ఏం చెబుతారని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్. వేణుగోపాలచారి అన్నారు. వారికి సమస్యలు ఏమున్నాయని అన్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్‌ది కంఠశోశే తప్ప మరోటి కాదన్నారు. ఆయన మాటనుఎ కాంగ్రెస్‌లో ఎంతమంది వింటారో చెప్పాలన్నారు. మరోవైపు సంఘం ఆదేశానుసారం యావత్ అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యింది. అన్నిరకాల సాంకేతికతను జోడిస్తూ తన పని తాను చేసుకుపోతున్నది. ఈ నేపధ్యంలో జిల్లాల్లో రాజకీయ పార్టీలపై తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాత అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కొంతమంది పేర్లు తెరవిూదకు వస్తున్నప్పటికీ కెసిఆర్ అలాంటి వాటిని కొట్టి పారేవారు. పటిష్టమైన కార్యాచరణతో అన్ని ప్రాంతాలను తీర్చిదిద్దిన కెసిఆర్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని చారి అన్నారు. ఆయన్ని ఎదుర్కోవాలనే నెపంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నా లాభం లేదన్నారు. గత నాలుగేండ్ల కాలంలో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అ¬రాత్రులు శ్రమించిన కెసిఆర్ దూకుడును తట్టుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదన్నారు. తెలంగాణ ప్రజల మనసుల్లో కెసిఆర్ ప్రత్యేకస్థానం సంపాదించారు. అందుకే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒక్కటే ఒంటరిగా బరిలోకి దిగుతున్నది. సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నెలకొన్న కొండంత విశ్వాసంతో అవిూతువిూ తేల్చుకునేందుకు సిద్ధమయ్యింది. ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల్లో ఒకటైన సీపీఐ కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తుల పేరుతో మహాకూటమిగా ప్రజల ముందుకు రావాలని నిశ్చయించుకున్నా తమకు పెద్దగా భయపడాల్సిన ఆగ్యం ఏర్పడలేదని అన్నారు. అత్యంత బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్ పార్టీని ఎదురొడ్డి కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల తరుపున నిలబడే నాయకుడెవరన్నదే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే సీఎం కేసీఆర్ సాధారణ సంగ్రామానికి శంఖారావం పూరించటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతున్నారని అన్నారు. హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఊరూ, వాడా తిరుగుతూ ప్రజామద్దతు కూడగడుతున్నారని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాలు, సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు బాటలు వేసుకుంటున్న తీరు వల్ల తమ విజయం మరింత రూఢి అయ్యిందన్నారు.