మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్.

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్.

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 2 జనం సాక్షి.
భారత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని, స్వచ్ఛత కు పేరుగాంచిన మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని గాంధీ చౌక్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చెప్పిన విధంగా పట్టణంలో స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పట్టణాలలో,గ్రామాలలో పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు విరివిగా నాటి పర్యావరానాన్ని పరిరక్షించాలన్నారు .
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి, లాల్ బహదూర్ శాస్త్రి ఫోటో లకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్,డి పి ఆర్ ఓ చెన్నమ్మ, డి ఆర్ డి ఏ ఉమా దేవి, ఏ ఓ బద్రప్ప, ఇ డి ఎస్సి కార్పోరేషన్ రమేష్ బాబు, ఆర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మన్సూర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.