మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి
ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి సెగలు గక్కడం ఇది మొదటిసారి కాదు, నిత్యం జరుగుతున్నదే. చవాన్ ఎమ్మెల్యేలను కలుపుకుని పోవటం లేదని అందరిని సమన్వయ పరుస్తూ పాలించటం లేదంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యరావు థాఖరేకి తాజాగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆదర్శ కుంబకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహారశైలి నచ్చక ఎమ్మెల్యేలు ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అశోక్ చవాన్ పట్ల కావాలనే దూకుడుగా వెళుతున్న పృథ్వీరాజ్‌కు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో జరిగిన పార్టీ లేజిస్లెటివ్ కమిటీ సమావేశాన్ని దాదాపు పన్నెండుమంది ఎమ్మెల్యేలు బహిష్కరించి పృథ్వీరాజ్‌కు బహిరంగంగానే సవాల్ విసిరిన విషయం విధితమే.