మహాశివరాత్రికి సర్వం సిద్ధంమహాశివరాత్రికి సర్వం సిద్ధంముస్తాబైన శివాలయాలు
భక్తులకు లోటుపాట్లు ఏర్పడకుండా సర్వం సిద్ధం
రామారెడ్డి ఫిబ్రవరి 16 ( జనంసాక్షి ) :
శివరాత్రికి సర్వం సిద్ధం చేశారని ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి పత్రికాముఖంగా గురువారం మాట్లాడుతూ , శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నా రు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ శివారులో దట్టమైన అడవిలో వెలసిన స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర ఆలయం లో పరమేశ్వరుడీ ఆత్మ శివలింగం ఉద్భవించిందని భక్తుల నమ్మకం మహా శివరాత్రి పండుగను జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో నిర్వహిస్తారని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేటి నుండి మూడు రోజుల వరకు ఉత్సవాలు స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని వసతులతో పాటు సర్వం సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి ఏటా మాదిరిగానే మహాశివరాత్రి పండుగకు ప్రత్యేకత కలిగి ఉండటంతోపాటు వీర శైవ పండితులతో భగవంతుడికి వేదమంత్ర ఉత్సవాలతో ఉత్సవాలను జరుపుకుంటామని అన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దైవ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటేత్తనున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట దేవస్థానం వద్ద మహాశివరాత్రికి జాతర ఉత్సవాలకు అధికారులు సకల సదుపాయాలు కల్పించడంలో ఆలయ సిబ్బంది నిమగ్నమయ్యారని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వివిధ మార్గాల గుండా వస్తుంటారన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఉన్న బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపబడునని తెలిపారు. శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన దృష్ట్యా దాదాపు మూడు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకు తగినట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది అత్యంత అద్భుతంగా ఉందని అన్నారు. స్నానాలు ఆచరిం చిన వారికి పాపాలు తొలగిపోయి పుణ్యాలు దరిచేరుతాయని అన్నారు. స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అదృష్టంగా భావిస్తారని అన్నారు.భక్తులు, చిన్నా రులకు స్వామివారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తామని అన్నారు. నిత్య అన్నదాననికి సహక రించిన భక్తులకు మద్దికుంట స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి కృప కటాక్షం కలుగుతుంద న్నారు. భక్తులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు ఉండేందుకు భక్తులకు సేవలను అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ఉండేందుకు వాహనాల పార్కింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కింగ్ నుండి భక్తులకు సౌకర్యం కోసం ఉచిత ఆటోల ప్రయాణం సేవలను ఏర్పాటు చేశామని అన్నారు. చంటి పిల్లల తల్లులకు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక దర్శనం క్యూలైన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించా మన్నారు. ఎండలో సేదతీరేందుకు భక్తులకు అక్కడక్కడ షామి యానాలు ఏర్పాటు చేశారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలతో మంచి నీటీ వసతి కల్పించమన్నారు. అడుగడుగున పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు ఆలయం చుట్టూ సీసీ కెమెరా నిఘ నిరంతరం ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య శిబిరాలు అందుబాటులో ఉంచామని అన్నారు. మజ్జిగ కేంద్రాలను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఆలయ ప్రధాన అర్చకులు ప్రభు స్వామి
మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర ఉత్సవాలు దీపారాధనతో ఆరంభమై గణపతి పూజ ,అఖండ దీపారాధన ,పుణ్యవచనం, వర్ణ పూజ ,అంకురార్పణ, ధ్వజారోహణ, నవగ్రహరా దన, ఈనెల 17 న శతవా మానాలి బిల్వ పత్రి పూజ పల్లకి సేవ గ్రామంలో ఊరేగింపు, మంగళ గౌరీ మాతాజీ కి కుంకుమ పూజ ఓడిబియ్యం , 19న ఆదివారం ఉదయం అగ్ని గుండాలు భగభగ కాలె నిప్పులపై భక్తులు నడుచుకుంటూ వెళ్తారు. అనంతరం పరిసమప్తి కార్యక్ర మాలు జరుగుతాయన్నారు.