మహాశివరాత్రి సందర్భంగామహాశివరాత్రి సందర్భంగావాడపల్లికు 60 ట్రిప్పుల ప్రత్యేక బస్సులు : డిపో మేనేజర్ పాల్ 


శ్రీశైలానికి రెండు ప్రత్యేక బస్సులు
మిర్యాలగూడ, జనం సాక్షి.
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈనెల 18న మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి వాడపల్లి పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేకంగా భక్తుల సౌకర్యం కోసం 15 బస్సులను, అరవై ట్రిప్పులగా వారీగా నడపనున్నట్లు డిపో మేనేజర్ బొల్లెధ్ధు పాల్ తెలిపారు. గురువారం డిపోలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక బస్సులు గుడి వద్దకు వెళ్లి తిరిగి డిపోకు వచ్చే క్రమంలో అన్నారం, సూర్యాపేట మీదుగా సోమవారం వద్ద గల సోమప్ప దేవాలయానికి ప్రతినిత్యం నడిచే బస్సుతోపాటు అదనంగా భక్తుల సౌకర్యం కోసం మరో బస్సును మొత్తం రెండు బస్సులను తిప్పడం జరుగుతుందన్నారు. అడవిదేవులపల్లి వద్ద గల సత్రశాలకు నిత్యము నడిచే బస్సుతోపాటు అదనంగా మరో బస్సును, ఫోన్ల ద్వారా అడుగుతున్న భక్తుల కోరిక మేరకు మిర్యాలగూడ నుండి ” శ్రీశైలానికి ” రెండు బస్సులను ఉదయం 10.00 లకు, మధ్యాహ్నం 12.00 లకు బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలంకు వెళ్లే భక్తులు ముందుగా సీట్ రిజర్వేషన్ సౌకర్యంతో బస్సులను ఏర్పాటు చేసి , భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా  ” మహా శివుని “దర్శన భాగ్యము కలిగించు నిమిత్తము మేము అన్ని వైపులా బస్సులను నడుపుచున్నామని తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా క్షేమంగా సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించలని డిపో మేనేజర్ పాల్ కోరారు.