మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలుమహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) హరి హరాదులు వెలిసిన ఆదిశిలాక్షేత్రం ద్వైతా అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాలను నిత్యం ఆచరిస్తూ అపర తిరుపతిగా విలసిల్లుతున్న మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని శివాలయంలో ఈ నెల 18న మహాశివరాత్రిసందర్భంగా భక్తులకు సేవా సదుపాయాలు కల్పించినట్లు దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. శివాలయంలో మహాశివరాత్రి రోజు నమక చమకాలతో మహాన్యాస పూర్వక మహా రుద్ర అభిషేకాలు, బిల్వార్చనలు,స్పర్శ దర్శనం జరుగుతాయని భక్తులు స్వామి సేవలో పాల్గొనేందుకు రూ.151 చెల్లించి రసీదు పొందాలని వారు కోరారు.స్వామివారి చరిత్రకలియుగ ఆరంభమునందు కేకారన్యము గల ఈ ప్రాంతంలో పరమశివుడు శ్రీనివాసుడు అవతరించడానికి ఘోరమైన తపస్సు చేశాడని గిరిశాచాల మహత్యం పురాణంలో వర్ణించారు. అనంతరం ఒకే శీలపై అనిరుద్ధ రూపంలో శ్రీనివాసుడు, అనంతశయనుడు,లక్ష్మీదేవి, వరాహ స్వామి,ఆంజనేయ స్వామి వెలిశారు.దీంతో ఇక్కడ క్షేత్రమూర్తి ఈశ్వరుడు గా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు శివ స్వాములు ఆధ్వర్యంలో 41 రోజులపాటు శివదీక్ష బూని ప్రతిరోజు అభిషేకాలు,పూజలు నిర్వహిస్తారు.