మాజీ మేయర్ బాబురావు మృతి
ఏలూరు,అక్టోబర్15(జనంసాక్షి): ఏలూరు నగర మాజీ మేయర్ కారే బాబురావు అకాల మరణం చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఏలూరు నగరానికి ప్రథమ మేయర్‌గా కారే బాబురావు 2009లో ఎన్నికయ్యారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఆయనచేసిన సేవలు కొనియాడారు.