మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 04 (జనం సాక్షి)సమాజంలోని యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వరంగల్ ఏసీపి బోనాల కిషన్ అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఉరుసు తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం అధ్యక్షతన బీఫార్మసీ, ఫామ్. డి , లో నూతనంగా చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎసిపి కిషన్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత ధూమపానం మద్యపానం డ్రగ్స్ తో ఆగిపోకుండా స్మార్ట్ఫోన్ ఫోబియాతో దిగజారిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారి ఆరోగ్యాలతో పాటు పూర్తి వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది అని అన్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలో నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. మామునూరు ఏసిపి సతీష్ కుమార్ మాట్లాడుతూ చదువుకోవాల్సిన సమయంలో విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి నేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాటికి దూరంగా ఉండాలని కోరారు. విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని కోరారు. కామెల్ డైరెక్టర్ మురళీధర్ మాట్లాడుతూ లక్ష్యసాధనకు అనువైనం మార్గం గురించి శోధించినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం మాట్లాడుతూ తమ కళాశాలలో సకల సౌకర్యాలను కల్పించడంతోపాటు బోధనలను శిక్షణలోను చక్కని వాతావరణం కలిగి ఉందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో కలిగి ఉండి చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిరంతర లక్ష్య సాధన మాత్రమే విజయాలను సాధిస్తుందని అన్నారు. డాక్టర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో తమ విజ్ఞానాన్ని నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, తాళ్ల వరుణ్, వైష్ణవి, ప్రిన్సిపాల్ డాక్టర్ బే తి శ్రీనివాస్ అధ్యాపకులు సత్యనారాయణ పట్నాయక్, కల్పన, పుష్టి, నాగిరెడ్డి, ఏవో మధుసూదన్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు