మానవత్వమా.. ఎక్కడ నీ చిరునామా?
ఆ తాతే మరణిస్తే తప్పెవరిదీ..?
చుట్టూ రణగొన ధ్వనులు.. రయ్‌రయ్ మంటూ వాహనాల పరుగులు.. మెట్రో పిల్లర్ నీడన సరిగ్గా బట్టల్లేకుండా కాళ్లూచేతులూ కదిలించలేని స్థితిలో ఓ అభాగ్యుడు.. అయినా చూసీచూడని నగరవాసులు తమ నిత్య కార్యచరణలో ఎప్పటిలాగే ఉరుకులూ పరుగులూ పెడుతున్నారు. హారన్ల మోత నడుమ కండ్లెదుటే ఓ మనిషి కొట్టుమిట్టాడుతున్నా పట్టనంత బిజీగా నగరవాసి ప్రయాణిస్తున్నాడు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో అచేతన స్థితిలో పడివున్న ఆ తాతకు ‘జనంసాక్షి’ తనవంతుగా ఓ పూట మంచినీళ్లు, బుక్కెడు బువ్వ పెట్టగలదు.. కానీ ఆ తర్వాత ఎవరన్నదే ప్రశ్న..!!
` హైదరాబాద్(జనంసాక్షి)