మానసిక ఒత్తిడితోనే మౌనిక ఆత్మహత్య


అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్న డిసిపి
హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): హెచ్‌సీయూ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసులో విచారణ చేస్తున్నామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చామని డీసీపీ తెలిపారు. హెచ్‌సీయూ ఫ్యాకల్టీ వేధింపులతో తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు మౌనిక తండ్రి తమకు ఫిర్యాదు చేశారని, వారి ఆరోపణలపై కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని అన్నారు. మౌనిక రూమ్‌లో ఉంటున్న స్నేహితురాలును కూడా విచారణ చేశామన్నారు. మౌనిక సెల్‌ ఫోన్‌ , ల్యాప్‌ టాప్‌ ను సీజ్‌ చేసి విచారణ చేస్తున్నట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడిరచారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మౌనిక ఒక సూసైడ్‌ లెటర్‌ రాసి తను ఉంటున్న గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. నా చావుకు నేను కారణం, నేను విూకు మంచి కూతుర్ని కాలేకపోతు న్నాను…నన్ను క్షమించండి నాన్న అంటూ లేఖలో రాసినట్లు చెప్పారు.