మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు అదేశం

ఢిల్లీ : ఎన్నికల ప్రణాళికల్లో హామీల అమలుపై మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం రాజకీయ పార్టీల ఉచిత హామీలను అవినీతిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వసతి సముదాయాల్లో ఎంపీలు, మంత్రులు తిష్ఠవేయడంపై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతులకు సూచించింది.