‘మార్చ్’లో పాల్గొనండి కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు !
న్యూఢిల్లీ: ఎట్టకేలకు కేసీఆర్ తన మౌనాన్ని వీడాడు..తెలంగాణ మార్చ్‌పై టీఆర్‌ఎస్ వైఖరేంటో స్పష్టం చేయని గులాబీ దళపతి నోరు విప్పాడు..జేఏసీలో ప్రధాన భాగస్వామి అయిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా గళం విప్పాడు..జేఏసీ తెలంగాణ మార్చ్‌పై పిలుపునిచ్చినప్పటి నుండి గుర్రుగా ఉన్న ఆయన చర్చల కోసం అంటూ తన మకాన్ని ఢిల్లీకి మార్చాడు…తెలంగాణ ప్రకటన కోసం ఎక్కే గడపా దిగే గడపా అంటూ కొనసాగిన చర్చల పర్వం బెడిసికొట్టింది..తెలంగాణ గురించి మార్చ్‌లోపు ప్రకటన ఇవ్వలేమన్న కాంగ్రెస్ పెద్దల ప్రకటనతో ఖంగుతిన్న కేసీఆర్ మార్చ్‌కు అనుమతివ్వాలంటూ రెండు రోజుల క్రితం ప్రకటించాడు..ఇక శుక్రవారం సర్కారు అనుమతివ్వడంతో తెలంగాణ మార్చ్‌కు మద్ధతు తెలుపుతూనే..తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు…