‘మార్చ్’ విజయవంతానికై ఉత్తరఅమెరికాలో ఉరిమిన జై తెలంగాణ
నాలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో భారీ ర్యాలీలు
న్యూజెర్సీ : సెప్టెంబర్30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. .దేశ విదేశాల ఆవల ఉన్నా తమ ఆశ శ్వాస తెలంగాణ రాష్ట్రమే నని నినదించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొని సీమాంధ్ర ప్రభుత్వంతో ఢీకొడుతుండగా తాము సైతం అంటూ మార్చ్ నిర్వహించారు. అది కూడా అలా ఇలా కాదు..ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. .ఇంటికో మనిషి- చేతికో జెండా అంటే జేఏసీ ఇచ్చిన పిలుపు స్పూర్తితో కదం కదం కలిపారు.. సంఘీభావ యాత్రల పేరుతో యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఉత్తేజాన్ని ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు. తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) ఆధ్వర్యంలో ఉత్తర అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లోని బోస్టన్, న్యూజెర్సీ, ఫిలడెల్పియా, డెట్రాయిట్ నగరాల్లో సెప్టెంబర్22నభారీ ర్యాలీలు నిర్వహించారు…తానా, న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో న్యూబ్రన్స్విక్స్ నగరంలో సంఘీభావ యాత్రను నిర్వహించారు. .తెలంగాణ రాష్ట్ర పటం ముద్రించిన ఫోటోలతో, వి సపోర్ట్ తెలంగాణ మార్చ్, వి వాంట్ తెలంగాణనౌ అంటూ పెద్ద అక్షరాలతో రాసిన బ్యానర్లను పట్టుకొని యాత్రను నిర్వహించారు…చీమల దండులెక్క తెలంగాణ ఎన్నారైలంతా కలిసి వచ్చి సంఘీభావయాత్రను ఘనంగా నిర్వహించారు…ఉప్పొంగిన కెరటంలా తరలివచ్చిండ్రు…ర్యాలీ తర్వాత అందరూ ఒక చోట సమావేశమయ్యారు… బిగించిన పిడికిళ్లు…సడలని పట్టుదలతో ఉద్యమ నినాదాలు చేశారు…ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అందరిలోనూ కనిపించింది..సాగరహారంలో తెలంగాణప్రజలంతా పాల్గొని విజయవంతంచేయాలని వారు కోరారు…ఈ సందర్భంగా తెలంగాణ పోరాట యోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు..తెలంగాణ రష్ట్ర ఆకాంక్షను మది నిండా నిలుపుకున్న బాపూజీ తన కల తీరకముందే వెళ్లిపోవడం బాధాకరమని వారు అభిప్రాయపడ్డారు..ఆయన కల నెరవేరేదాక ఉద్యమం ఆపొద్దన్నారు..అదే సమయంలో బోస్టన్‌లోనూ..డెట్రాయిట్…ఫిలడెల్పియాల్లోనూ ఈ సంఘీభావ ర్యాలీలు కొనసాగాయి…ప్రాంతం ఏదైనా తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ఏకైక ధ్యేయమని వారు వెల్లడించారు…ఏదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరు ఆపేది లేదన్నారు…