‘మార్చ్ వ్యవహిరంలో ప్రభుత్వానిదే బాధ్యత’
న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా శాంతితో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. శాసనసభ వ్యవహారాల తీరుపై తాను స్పందించను అని పేర్కొన్నారు.