మాలీలను ఎస్టీల్లో చేర్చాలి

ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు పోరాడుతామని మాలీసంఘం నేతలు అన్నారు. గత 20 ఏళ్ల నుంచి ఎస్టీ ¬దా కోసం మాలీలు పోరాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో హావిూ ఇచ్చినా ఇంతవరకు నేరవేరలేదన్నారు. చెల్లప్ప కమిషన్‌ను తిరిగి నియమించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే ఉపాధ్యాయుల స్థానికత ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో జమ చేయాలన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయల కోసం నిర్వహణ నిధులను విడుదల చేయాలని, విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలని కోరారు. కస్తూర్బా విద్యాలయాలలో పనిచేస్తున్న సీఆర్టీలకు వెంటనే వేతనాలను చెల్లించాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెగ్యూలర్‌ వార్డెన్లను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.