మా భూమి మాకు పట్టా కావాలని

రైతు కుటుంబం ఆందోళన
తహసీల్దార్ కార్యాలయం వద్ద
పెద్దవంగర సెప్టెంబర్ 30(జనం సాక్షి ) మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి సతీష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్ పట్టుకొని మా భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. మండల కేంద్రానికి చెందిన సతీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పెద్దవంగర శివారులో సర్వేనెంబర్ 541 లో గల భూమి ఒక ఎకరం 22 గంటలు. ఈ భూమి మా తల్లి గారైన ఎడవెల్లి కళమ్మ పేరా గతంలో పట్టాయి ఉంది. 2019 వ సంవత్సరంలో మాకు తెలియకుండా మా సోదరి మిల్కూరి సరిత తన పేరు పట్టా చేసుకుంది. అప్పటినుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన మా భూ సమస్యను పరిష్కరించలేదు. దీంతో కలత చెంది శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన చేపట్టారు అని తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ కుమారస్వామి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అవగాహన కల్పించి సొంత కూచికపై సాయంత్రం విడుదల చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ పై తహసీల్దార్ జి రమేష్ బాబు.ను పూర్తి సమాచారం అడగగా సరిత పేరా భూమి పట్టాయి ఉందని, నిబంధనల మేరకు కొనుగోలుదారుడు మహేశ్వర్ రెడ్డి పేరా రిజిస్ట్రేషన్ చేశామని చెప్పారు.